Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 September 2024, 8:44 pm Posted by : ramakrishna

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ లో ఎమ్మెల్యే మధన్ మోహన్

ఎల్లారెడ్డి, బతుకమ్మ : హైదరాబాద్ వేదికగా రెండవ రోజు గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి  శ్రీధర్ బాబు తో కలిసి ఎమ్మెల్యే, గ్లోబల్ ఎఐ కాన్ఫరెన్స్ వైస్ చైర్మన్ మదన్ మోహన్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎల్లారెడ్డి గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ వైస్ చైర్మన్ మదన్ మోహన్  తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రపంచ వ్యాప్తంగా ఏఐ రంగంలో సేవలు అందిస్తున్న కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఏఐ రంగంలో వారి అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.