Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 6:02 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డి అభివృద్ధే లక్ష్యం గా ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి

 

. . . రూ.19.60 కోట్ల అభివృద్ధి పనుల నిధులు మంజూరుకు సీతక్క ని కలిసిన ఎమ్మెల్యే

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ నిరంతరం కృషి చేస్తున్నారు. గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గత వర్షాకాలంలో భారీ వరదల కారణంగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న పలు హై లెవెల్ బ్రిడ్జిలు, పంచాయతీరాజ్, ఆర్&బీ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి ని ఆయన కోరారు. లింగంపల్లి ఖుర్ద్ హై లెవెల్ బ్రిడ్జి, ఆదివిలింగల్ హై లెవెల్ బ్రిడ్జి, కన్నాపూర్ హై లెవెల్ బ్రిడ్జి, గిద్దా హై లెవెల్ బ్రిడ్జి, గాంధారి మండలం సంగం రేవు బ్రిడ్జి, కన్నాపూర్‌కు పీడబ్ల్యూడీ రోడ్, లింగంపేట్ మండలం మోతే – రామలక్ష్మణ్‌పల్లి పీడబ్ల్యూడీ రోడ్, రామారెడ్డి – గిద్దా ఆర్&బీ రోడ్, గాంధారి – చాద్మల్ పీడబ్ల్యూడీ రోడ్డుపై సోమారం వయా గుజ్జులోంక తండా, దుర్గం, కొత్తబాధి బ్రిడ్జి, రాజంపేట్ మండలం పలుగడ్డ తండాకు ఆర్&బీ రోడ్, రాజంపేట్ మండలం శాలిప్ప తండాకు ఆర్&బీ రోడ్, కామారెడ్డి – ఎల్లారెడ్డి రోడ్ నుంచి తాడ్వాయి ఐటీఐ కాలేజీ వరకు బీటీ రోడ్, జువ్వాడి జెడ్పీ రోడ్ నుంచి గాంధారి స్పోర్ట్స్ స్టేడియం వరకు రూ.1.5 కోట్లతో బీటీ రోడ్, అర్గొండ గ్రామం వద్ద గుండారం – మెదక్ ఆర్&బీ రోడ్ నుంచి గోదాం సైట్ వరకు రూ.2.5 కోట్లతో బీటీ రోడ్ ల అభివృద్ధి పనులకు మొత్తం రూ.19.60 కోట్ల నిధుల మంజూరుకు మంత్రి ని కోరగా, సానుకూలంగా స్పందించి త్వరితగతిన నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారులు, వంతెనలు, మౌలిక వసతులు కల్పించి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ అందించాలనే లక్ష్యంతో ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.

 

MLA Madan Mohan's goal is the development of Yella Reddy