వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
లింగంపేట్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు, ఆకుపచ్చ తెలంగాణ సాధనలో భాగంగా, అటవీ శాఖ అధికారులు లింగంపేట్ బీట్ పరిధిలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు పర్యావరణ సంరక్షణ యొక్క ప్రాధాన్యతను వివరించారు. పచ్చదనం పెంచడం అనేది ఈ తరం బాధ్యత మాత్రమే కాదు, భవిష్యత్ తరాల భద్రతకు మనం వేసే...