Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 9:04 pm Posted by : ramakrishna

వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్

లింగంపేట్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు, ఆకుపచ్చ తెలంగాణ సాధనలో భాగంగా, అటవీ శాఖ అధికారులు లింగంపేట్ బీట్ పరిధిలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు పర్యావరణ సంరక్షణ యొక్క ప్రాధాన్యతను వివరించారు. పచ్చదనం పెంచడం అనేది ఈ తరం బాధ్యత మాత్రమే కాదు, భవిష్యత్ తరాల భద్రతకు మనం వేసే బోన్సాయి. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కనీసం ఒక్కో మొక్క నాటి దాన్ని సంరక్షిస్తేనే వాతావరణ మార్పులను ఎదుర్కోవచ్చు. అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు.

MLA Madan Mohan participated in the Vana Mahotsava program.