డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డి పేట్ మండల కేంద్రం గోపాల్‌పేట్‌లో డా.బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపాల్‌పేట్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ సమాజానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.