Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2025, 2:11 pm Posted by : ramakrishna

  సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ 

హైదరాబాద్,బతుకమ్మ :   హైదరాబాద్ లో సీఎం  రేవంత్ రెడ్డి  తన కార్యాలయంలో మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, మరమ్మతు పనుల పురోగతి గురించి వివరించారు. నియోజకవర్గ పరిధిలోని మైనర్ ఇరిగేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా వాటిని తక్షణమే పునరుద్ధరించాలని సీఎంను అభ్యర్థించారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు. అదనపు ఇందిరమ్మ ఇల్లు మంజూరు.. వంటి అంశాలపై కూడా సవివరంగా చర్చించారు. వీటిపై సీఎం రేవంత్ రెడ్డి  సానుకూలంగా స్పందించి, అవసరమైన నిధులను త్వరితగతిన విడుదల చేస్తామని హామీ ఇచ్చారు