2 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పురపాలక సంఘం పరిధిలోని 11వ వార్డు (విలీన గ్రామాలైన లింగారెడ్డిపేట)లో మున్సిపల్ నిధుల ద్వారా రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్లు,డ్రైనేజీ నిర్మాణ పనులకు మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా లింగారెడ్డిపేటలో కమ్యూనిటీ హాల్ మరమ్మతుల నిమిత్తం మున్నూరు కాపు సంఘానికి రూ.5 లక్షలు, ముదిరాజ్ సంఘానికి రూ.5లక్షలు మంజూరు కాపీలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ వాడలో అంగన్‌వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. లింగారెడ్డిపేట ప్రాధమిక...