కొక్కొండ గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘం భవనంతో పాటు, వానాకాలం (ఖరీఫ్) 2026-27 సీజన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు. బుధవారం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళా సంఘాల విజ్ఞప్తికి స్పందించి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. గతంలో...