బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా బిల్లాల్ లోని మధుమాలాంచ కాలేజీని పరిశీలించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్టల్ కొరకు 25 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. బోధన్ లోని మండల పరిషత్ నూతన భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. బోధన్ లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు గదుల కోసం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మశారత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంకుసంధ్య దామోదర్ రెడ్డి, డిపిసిసి డెలికేట్ గంగా శంకర్, ప్రభుత్వ అధికారులు నాయకులు పాల్గొన్నారు.