Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 8:36 pm Posted by : ramakrishna

సెంటర్ లైటింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో వేగంగా కొనసాగుతున్న సెంటర్ లైటింగ్ పనులను జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా పాటించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని అధికారులతో పాటు కాంట్రాక్టర్లను ఆదేశించారు.  పట్టణంలో సెంటర్ లైటింగ్ పూర్తయితే రాత్రి సమయంలో రాకపోకలు సులభతరం కావడంతో పాటు ప్రజల భద్రతకు కూడా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 

MLA inspects central lighting works.