Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2024, 8:15 pm Posted by : ramakrishna

బస్ స్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణంలో నిధులు లేక మధ్యలోనే నిర్మాణం ఆగిపోయిన ఎల్లారెడ్డి బస్ స్టాండ్ పనులు మదన్ మోహన్ ప్రత్యేక కృషితో మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇటీవలే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కలసి బస్ స్టాండ్ నిర్మాణ కొరకు పెడ్డింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరగా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేసింది. ఈ సందర్భంగా బస్ స్టాండ్ నిర్మాణ పనులకు నిధులు మంజూరు అయ్యాయి. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్  ఎల్లారెడ్డి పట్టణంలో బస్ స్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు, ఎల్లారెడ్డి టౌన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

MLA inspected the bus stand construction works