Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 8:02 pm Posted by : ramakrishna

వారాహీ అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వారాహీ అమ్మవారి కృపాకటాక్షాలు నగర వాసులపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు. నగరంలోని అమ్మా నగర్లో నిర్మిస్తున్న ఆలయ పనులను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలోని తొలి వారాహి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. కృష్ణశిల తో ఆలయాన్ని నిర్మించటం సంతోషకరమన్నారు. ఇందూరులో ఆధ్యాత్మిక చింతన పెరిగిందని, హిందువుల ఐక్యతకు ఆలయాలు దోహదపడతాయన్నారు. యువత ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిత్య ఆలయ దర్శనం ఎంతో శ్రేయస్కరమన్నారు. ఇకపై జరిగే వారాహీ అమ్మవారి పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మంచాల జ్ఞానేందర్, ఎల్ వీ ఆర్ అధినేత శివ ప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

MLA inaugurates the construction of the Goddess Varahi temple.