Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2025, 8:43 pm Posted by : ramakrishna

డాక్టర్ బాలాజీని సన్మానించిన ఎమ్మెల్యే

బతుకమ్మ, జుక్కల్ : 84వ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా హిందీ విభాగంలో డాక్టరేట్ పట్టా అందుకున్న డాక్టర్ బాలాజీని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ, డాక్టర్ బాలాజీ తన చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి ఇటీవలే ఉస్మానియా గవర్నర్ చేతుల మీదుగా డాక్టర్ పట్టా అందుకోవడం యావత్ జుక్కల్ నియోజకవర్గానికి ఎంతో గర్వకారణం అని అన్నారు. అదేవిధంగా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి, మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ తనకు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.