విద్యార్థులతో అల్పాహారం చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి , బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని ఎమ్మెల్మే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదివారం ఉదయం సందర్శించారు. వసతి గృహంలో వసతులను పరిశీలించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్ధులతో కాసేపు ముచ్చటించి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.