Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 5:35 pm Posted by : ramakrishna

రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

 

. . . పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచన

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

అత్యంత నియమనిష్టలతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గంగా జమునా తెహజీబ్ గా హిందూ ముస్లిం లు వర్ధిల్లాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఈ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజల పై ఉండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇఫ్తార్ విందు, ఈద్ ముబారక్ కిట్లను పంపిణీ చేసి పండుగ విశిష్టతను చాటి చెప్పిందని గుర్తు చేశారు. సర్వమతాలను సమదృష్టితో చూసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు.