సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి
గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల చిరకాల కల నెరవేరింది సంబరాలు జరుపుకున్న విద్యార్థులు నిజామాబాద్ రూరల్ బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో 30 సంవత్సరాల చిరకాల కల ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలకు తరగతులు అనుమతి రావడం, ఈ సంవత్సరం 2025-2026 నుండే తరగతులు ప్రారంభమవుతాయని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు.తెలంగాణ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కళాశాలఏర్పాటు కోసం కృషి చేసినటువంటి తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారులు...