అంతర్ పాఠశాల క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి

జక్రాన్ పల్లి, బతుకమ్మ : జక్రాన్ పల్లి మండలం‌ పడకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, మండల అంతర పాఠశాల క్రీడలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, డా: భూపతి రెడ్డి ప్రారంభించారు. మొదట వివిధ గ్రామాల్లోని క్రీడా విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడ జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలను కూడా ఆడాలని ఆయన తెలిపారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని రెండిటిని సరి సమానంగా తీసుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు....