Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2025, 7:49 pm Posted by : ramakrishna

అంతర్ పాఠశాల క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి

జక్రాన్ పల్లి, బతుకమ్మ : జక్రాన్ పల్లి మండలం‌ పడకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, మండల అంతర పాఠశాల క్రీడలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, డా: భూపతి రెడ్డి ప్రారంభించారు. మొదట వివిధ గ్రామాల్లోని క్రీడా విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడ జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలను కూడా ఆడాలని ఆయన తెలిపారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని రెండిటిని సరి సమానంగా తీసుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. పడకల్ గ్రామంలో నూతన పాఠశాల భవన నిర్మాణానికి సహకరిస్తానని , స్మశాన వాటికకు

MLA Dr. Bhupathi Reddy inaugurated inter-school sports

వెళ్లే మాలాగు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి మరియు  పడకల్ పెద్ద చెరువు అలుగు నిర్మాణానికి తన వంతు సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్, హెచ్ఎం సురేందర్ రెడ్డి , పి ఈ టి శ్రీనివాస్, డీఈవో అశోక్, ఎమ్మార్వో కిరణ్ మై, ఎండిఓ సతీష్ కుమార్ ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి,పడకల్  వీడిసి కమిటీ మెంబర్స్, నిజామాబాద్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, డిసిఎంఎస్ మాజీ చైర్మన్,  సాయి రెడ్డి, చిన్న సాయి రెడ్డి, ఆర్మూర్ గంగారెడ్డి, కొలి ప్యాక్  భాస్కర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూపర్ వినోద్, నట్టా తిరుపతి, లక్ష్మణ్, ఆర్మూర్ గంగారెడ్డి, నాగుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

 

MLA Dr. Bhupathi Reddy inaugurated inter-school sports