గంగపుత్ర సంఘానికి ఎమ్మెల్యే విరాళం
సదాశివనగర్, బతుకమ్మ : సదాశివనగర్ గ్రామ గంగపుత్ర సంఘానికి రూ.లక్షా విరాళాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అందజేశారు. ఎన్నికల సమయంలో గంగపుత్ర సంఘ సభ్యులు తమ ఆర్థిక, సామాజిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు విన్న మదన్ మోహన్ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తానని, సంఘానికి లక్ష రూపాయల సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుతూ విరాళాన్ని గంగపుత్ర సంఘ సభ్యులకు స్వయంగా అందజేశారు. ప్రజలతో చేసిన ప్రతి హామీని గౌరవంగా తీసుకుని, నెరవేర్చడమే తన...