Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 July 2025, 7:55 pm Posted by : ramakrishna

గంగపుత్ర సంఘానికి ఎమ్మెల్యే విరాళం

సదాశివనగర్, బతుకమ్మ : సదాశివనగర్ గ్రామ గంగపుత్ర సంఘానికి రూ.లక్షా విరాళాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అందజేశారు. ఎన్నికల సమయంలో గంగపుత్ర సంఘ సభ్యులు తమ ఆర్థిక, సామాజిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు విన్న మదన్ మోహన్ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తానని, సంఘానికి లక్ష రూపాయల సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుతూ  విరాళాన్ని గంగపుత్ర సంఘ సభ్యులకు స్వయంగా అందజేశారు. ప్రజలతో చేసిన ప్రతి హామీని గౌరవంగా తీసుకుని, నెరవేర్చడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గంగపుత్ర సంఘ సభ్యులు ఎమ్మెల్యే తమకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చి గంగ పుత్ర సంఘ ప్రజలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ  ఆయన నాయకత్వాన్ని కొనియాడారు.

MLA donates to Gangaputra Sangh