కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గాంధారి, బతుకమ్మ :   గాంధారి మండలంలోని చెన్నాపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం చాలా వెనుకబడిందని, గత 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా మంజూరు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లు లేని నిరుపేదలను...