Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 6:08 pm Posted by : ramakrishna

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి డిచ్ పల్లి లోని కేఎన్ఆర్ గార్డెన్ లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పక్షాన ఉంటూ, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్, ఇందల్వాయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరు నవీన్ గౌడ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు, సర్పంచ్ లు లోకనీ గంగామణి గంగారం, సంగీత దిలీప్, నవీన్ నాయక్, లబ్ధిదారురాలు ఎల్లవ్వ, ఉప సర్పంచ్ లు, నాయకులు బైరి రవి, మాజీ సర్పంచ్ ఆర్పెల్లి దశరథ్, మోతిలాల్ నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు.