గణేష్ మండపాలకు ఎమ్మెల్యే ధన్ పాల్ ఆర్థిక సహాయం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ధన్ పాల్ లక్ష్మీ బాయ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందూర్ గణేష్ మండపాలకు రెండో రోజు మంగళవారం అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ఆర్ధిక సహకారం కార్యక్రమాన్ని కొనసాగించారు. రెండో రోజు కూడా భారీగా మండపం నిర్వాహకులు రావడంతో వారికీ ఇబ్బంది లేకుండా పది కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ బాల గంగాధర్ తిలక్,ఛత్రపతి శివాజీ మహారాజ్ లను స్ఫూర్తిగా తీసుకొని హిందువులలో ఐక్యమత్యం పెంపొందించడానికి ...