- అన్నదానం, రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పుట్టినరోజు సందర్బంగా నగరం అంత సేవ కార్యక్రమాలు నిర్వహించారు. బిజెపి పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో ఉండాలని నగరంలో ఆలయాలలో ప్రత్యేక పూజలు,అన్నదాన కార్యక్రమాలు,రక్తదాన శిబిరాలు,పెద్దఎత్తున నిర్వహించారు. శ్రీవాసవి కన్యాకాపరమేశ్వారి ఆలయం,నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణి చేశారు. నీలకంఠేశ్వర ఆలయంలో మహా అన్నదానం,దుబ్బ అరుంధతి నగర్ లో అన్నదానం,నాగారం ,క్వార్టర్స్ లో అన్నదానం,పీఎల్ ఎంఎస్ వద్ద గల పెట్రోల్ బంక్ దగ్గర అన్నదానం,కొత్త గంజ్ లోని అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం,మార్వాడి గల్లీ డిఎస్ఎన్ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలలో దాదాపు వందమంది రక్తదానం చేసారు. ఖలీల్ వాడిలోని పలు చోట్ల మొక్కలు నాటడం జరిగింది. వర్ని చౌరస్తాలో మజ్జిక పంపిణి వంటి సేవ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ తన మీద ప్రేమ అభిమానాలతో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సేవ కార్యక్రమాలకు ధన్యవాదాలు తెలిపారు. తనను ఆదరించే బిజెపి నాయకులు, శ్రేయోభిలాషులు,అభిమానులు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని తెలిపారు.
