ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ధన్‌పాల్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ బుధవారం పరామర్శించారు. ప్రమోద్ తల్లి, భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ప్రమోద్ త్యాగం ఎప్పటికీ మరువలేము. ఆయన కుటుంబం ఒంటరిగా లేదని, ప్రభుత్వం మరియు ప్రజలు వారితో ఉన్నారని” ధైర్యం చెప్పారు. ధన్‌పాల్ సూర్యనారాయణ వారి కుటుంబానికి ఆర్థికంగా, విద్యాపరంగా సహాయం అందిస్తానని ప్రకటించారు. ప్రమోద్ పిల్లలు పదో తరగతి...