Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2025, 1:24 pm Posted by : ramakrishna

పాలజ్ గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్, బతుకమ్మ :  తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన పాలజ్ కర్ర గణపతిని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ దర్శించుకున్నారు.  ఈసందర్భంగా భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా సర్వజనిక్ గణేష్ మండలి ఆలయ పూజరులు ఎమ్మెల్యే ధన్ పాల్ కు  పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు  ఏడు దశాబ్దాల చరిత్ర గల  కర్ర గణపతి ఆలయం భక్తుల   కోరికలను తీరుస్తుందన్నారు. కర్ర గణపతి ని 11 రోజులు భక్తి శ్రద్దలతో పూజిస్తే ఎటువంటి విషవ్యాధులు దరి చేరవని అన్నారు. ప్రజలు భక్తి శ్రద్దలతో కర్రగణపతిని పూజించి నిమజ్జనం చేయకుండా ఊరేగించి ఒక గదిలో భద్రపరచడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కర్ర గణపతి ఆశీర్వాదంతో దేశ,  రాష్ట్ర ప్రజలదరు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


MLA Dhanpal visits Palaj Ganapathi