నాగారం డంపింగ్ యార్డును సందర్శించిన ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇందూర్ అర్బన్ అసెంబ్లీ పరిధిలోని నాగారం డంపింగ్ యార్డ్‌ను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మంగళవార సందర్శించారు.. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, ఈ డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బయో-మైనింగ్ ద్వారా శుభ్రపరిచే పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్త వల్ల పరిసరాలకు చాలా సమస్యలు వస్తాయని తెలిపారు. ఈ చెత్తను తొలగించడానికి బయో-మైనింగ్ పద్ధతి ఉపయోగిస్తున్నారన్నారు. దీనివల్ల పాత చెత్తను వేరు చేసి, శుభ్రపరచి, భూమిని తిరిగి ఉపయోగించుకునేలా...