తిరంగా ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  నగరంలో తిరంగా ర్యాలీని  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ తిరంగా ర్యాలీ గాంధీ చౌక్ నుంచి ప్రారంభమై రైల్వే స్టేషన్ వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, లక్ష్మీనారాయణ, స్రవంతి రెడ్డి, పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు  పాల్గొన్నారు.