జిల్లా సమస్యలను అసెంబ్లీలో లెవనెత్తిన ఎమ్మెల్యే ధన్ పాల్

హైదరాబాద్, బతుకమ్మ : జిల్లాలోని సమస్యలను అర్బన్ ఎమ్మెల్యే ధన్ సూర్యనారాయణగుప్తా మంగళవారం అసెంబ్లీలో లెవనెత్తారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరారు.  నిజామాబాదు అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 50,000 మంది పేదలు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తులు చేసుకున్నారన్నారు. నియోజకవర్గంలో స్థలం లేని లబ్ధిదారులు వేల సంఖ్యలో ఉన్నారన్నారు. తక్షణమే మొదటి విడుతలోనే వారికీ ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే నాగారంలో 396 కలెక్టర్ బైపాస్ లో 252 డబుల్ బెడ్రూంలు నిర్మించి వదిలేయడంతో శిథిలావస్థకు చేరాయన్నారు. గతంలో  ఈ...