Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 January 2026, 9:23 pm Posted by : ramakrishna

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్ పాల్

 

. . . యువకులతో కలిసి గాలిపటం ఎగురవేసిన ఎమ్మెల్యే

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

 సంక్రాంతి పండుగ పురస్కరించుకొని  నగరంలోని వినాయక నగర్‌లో సంక్రాంతి సంబురాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక యువతతో కలిసి గురువారం గాలిపటం ఎగరవేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల పండుగగా, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే మహత్తర పండుగగా నిలుస్తుందని తెలిపారు. తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయాలు, ఆచారాలు కొనసాగాలంటే ఇలాంటి వేడుకలు ప్రతి కాలనీలో జరగాలని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మొబైల్ సంస్కృతికి పరిమితం కాకుండా, మన పండుగల ప్రాముఖ్యతను గుర్తించి సంస్కృతిని కాపాడాలని సూచించారు. వినాయక నగర్ వాసులు ఐక్యంగా పండుగను జరుపుకోవడం అభినందనీయ మని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఇందూర్ నగరాన్ని అభివృద్ధితో పాటు సంప్రదాయాలకు నిలయంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు.

MLA Dhanpal participated in Sankranti celebrations