సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పంపిణీ చేశారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సీఎం సహాయ నిధి ద్వారా 100 మందికి 26,49,000 రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్బంగా ధన్ పాల్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, అత్యవసర ఆరోగ్య అవసరాలకు సీఎం సహాయ నిధి  పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్ధిక...