Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 November 2025, 8:09 pm Posted by : ramakrishna

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పంపిణీ చేశారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సీఎం సహాయ నిధి ద్వారా 100 మందికి 26,49,000 రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్బంగా ధన్ పాల్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, అత్యవసర ఆరోగ్య అవసరాలకు సీఎం సహాయ నిధి  పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్ధిక భరోసా లభిస్తుందని అన్నారు. తన నియోజకవర్గంలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం పొందలేని పరిస్థితిలో ఉంటే, వారికి ఈ పథకం ద్వారా ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నాట్లు తెలిపారు.ఇప్పటి వరకు అనేకమందికి సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించామని, అర్హులైన ప్రతిఒక్కరికీ సహాయం అందేలా ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అప్లయ్ చేసుకున్న ప్రతి లబ్ధిదారుని దరఖాస్తులను సెక్రటరేట్ కి పంపించడం జరుగుతుందన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా నియోజకవర్గ ప్రజల కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగల్లో లక్ష్మి నారాయణ, మాజి కార్పొరేటర్లు న్యాలం రాజు ,  పంచ రెడ్డి శ్రీధర్,  మాస్టర్ శంకర్,  కృష్ణ,  బట్టు రాఘవేంద్ర , కిషోర్,  ముత్యాలు,  మఠం పవన్,  బట్టికిరి ఆనంద్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

MLA Dhanpal distributed CMRF cheques