డీఎస్సీగా ఎంపికైన నిఖితకు ఎమ్మెల్యే ధన్ పాల్ అభినందనలు
నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాలలో జిల్లాకు చెందిన నిఖిత రెడ్డి 386వ ర్యాంకు సాధించి డీఎస్పీ శిక్షణకు ఎంపికైన విషయం తెలిసిందే. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణను తన క్యాంపు కార్యాలయంలో నిఖిత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్బంగా నిఖిత రెడ్డిని ఎమ్మెల్యే శాలువాతో సత్కారించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతు గుత్ప గ్రామానికి చెందిన నిఖిత సామాన్య రైతు కుటుంబంలో జన్మించిందన్నారు. నిఖిత భవిష్యత్ లో ఉత్తమ సేవాలందిస్తూ ఉన్నత శిఖరాలను...