Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 September 2025, 12:18 pm Posted by : ramakrishna

డీఎస్సీగా ఎంపికైన నిఖితకు ఎమ్మెల్యే ధన్ పాల్ అభినందనలు

నిజామాబాద్, బతుకమ్మ :  ఇటీవల ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాలలో  జిల్లాకు చెందిన నిఖిత రెడ్డి 386వ ర్యాంకు సాధించి డీఎస్పీ శిక్షణకు ఎంపికైన విషయం తెలిసిందే. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణను తన క్యాంపు కార్యాలయంలో నిఖిత రెడ్డి   మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్బంగా  నిఖిత రెడ్డిని ఎమ్మెల్యే  శాలువాతో సత్కారించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతు గుత్ప గ్రామానికి చెందిన నిఖిత సామాన్య రైతు కుటుంబంలో జన్మించిందన్నారు.  నిఖిత భవిష్యత్ లో  ఉత్తమ సేవాలందిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, ఇందూర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు. నేటి యువతరం నిఖితను ఆదర్శంగా తీసుకోని ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నారు. నిఖిత రెడ్డి డీఎస్పీగా ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.