ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
సిరికొండ, బతుకమ్మ:మండలంలోని తూంపల్లి గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే యూకేజీ పిల్లలను గ్రామస్తులు కట్టుబడి చేసి గవర్నమెంట్ పాఠశాలకు పంపాలని నిర్ణయించారు. ప్రాథమిక పాఠశాలలో సరైన గదులు లేకపోవడంతో విద్యార్థులు నెలపైన కూర్చుంటున్నారని జిల్లా విద్యాశాఖ అధికారితో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. వెంటనే తగు చర్యలు తీసుకొని విద్యార్థులకు తరగతి గదిని కేటాయించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట...