జీజీహెచ్ ను సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. అంతకుముందు కలెక్టర్ మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్), క్రిటికల్ కేర్ యూనిట్ లతో కూడిన భవన సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం జీజీహెచ్ లో ఆసుపత్రి పనితీరుపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష జరిపారు. ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకనూ కొత్తగా సమకూర్చాల్సిన సదుపాయాలు తదితర...