Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 6:24 pm Posted by : ramakrishna

మాలవత్ పూర్ణ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి

సిరికొండ, బతుకమ్మ: సిరికొండ మండలంలోని పాకాల గ్రామానికి చెందిన ఎవరెస్ట్ అధిరోహిణి మాలవత్ పూర్ణ తండ్రి మాలవత్ దేవదాస్ నాయక్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలిసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శనివారం పూర్ణ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. మాలవత్ దేవదాస్ నాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పూర్ణతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, పూర్ణ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని, అలాగే దేవదాస్ నాయక్ ఆసుపత్రి చికిత్సకు సంబంధించిన ఖర్చులు ప్రభుత్వం ద్వారా పొందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, భాస్కర్ రెడ్డి, ఉమ్మాజీ నరేష్, మండల అధ్యక్షుడు బాకారం రవి, శివాజీ నాయక్, ప్రవీణ్, దేగాం సాయిలు, మహేందర్, బాకారం సంతోష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

MLA Bhupathi Reddy visits Malavat Poorna family