Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 7:39 pm Posted by : ramakrishna

కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి

నిజామాబాదు రూరల్, బతుకమ్మ :

 

రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాపిరెడ్డి మరణించిన నేపధ్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దుఃఖ సమయంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ మండలం సారంగాపూర్ గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ తల్లి ఇటీవల మృతి చెందిన కారణంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మోపాల్ మండలం బోర్గాం (పి) గ్రామంలో సుదర్శన్ రెడ్డి తల్లి మరణంతో అక్కడి కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గ్రామాల సర్పంచులు, ఎ ఎం సి చైర్మన్ ముప్పా గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు భాగరెడ్డి, పీసీసి డెలిగేట్ శేఖర్ గౌడ్, భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

MLA Bhupathi Reddy visited the families
MLA Bhupathi Reddy visited the families