Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 8:38 pm Posted by : ramakrishna

మంచిప్ప గాలివాన బీభత్సం పై ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆరా

 

. . . గాలివాన కారణంగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, నేలకొరిగిన చెట్లు

 

. . . దెబ్బతిన్న ఇండ్లు. . . అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే

 

మంచిప్ప, బతుకమ్మ :

 

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధి మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో గ్రామంలో భారీ వృక్షాలు నేలకూలాయి, గ్రామస్తులకు చెందిన పలువురి ఇళ్లు దెబ్బతినడంతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఏపీ పర్యటన నిమిత్తం బయలుదేరిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి విషయం తెలుసుకున్న వెంటనే స్పందించి.. సంబంధిత విద్యుత్,రెవెన్యూ , వ్యవసాయ తదితర శాఖల అధికారాలతో ఫోన్లో మాట్లాడారు.. పలు వివరాలు అడిగి తెలుసుకొని తక్షణ చర్యలకు పలు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన చెట్లను వెంటనే తొలగించేల తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు మంచిప్ప సర్పంచ్ గంగామణి-రాజేష్ తో మాట్లాడి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని నష్టపోయిన వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కాగా గ్రామంలో కొన్ని ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఐతే ఇండ్లు కోల్పోయిన వారికి అండగా ఉంటామని ఎవరు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే తెలిపారు.