జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎనిమిది బూత్ లకు ఇన్‌చార్జిగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి నియామకం

నిజామాబాద్,  బతుకమ్మ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో శనివారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ని జూబ్లీహిల్స్ పరిధిలోని ఎనిమిది బూత్లకు ఇన్‌చార్జిగా నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని,...