ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వాహనం తనిఖీ
సిరిసిల్ల, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి చెక్ పోస్ట్ వద్ద వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనాన్ని సోమవారం అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కారణంగా ఈ తనిఖీ నిర్వహించారు. ఓటర్లను ప్రభావితం చేసే వస్తువులు లేదా డబ్బు తరలింపు జరగకుండా ఉండేందుకు నిబంధనల ప్రకారం అధికారులు ఆయన వాహనాన్ని ఆపి, తనిఖీ చేశారు.