మిషన్ భగీరథ నీరు వచ్చేదెప్పుడో..?

పూర్తి అయిన సర్వే.. బతుకమ్మ, మోర్తాడ్:  తలా పాపునకు నీరుండి తడియారని గొంతు అన్నట్టుగా కనిపిస్తుంది మిషన్ భగీరథ పథకం. ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి నిత్య నీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ఫలాలు ప్రజలకు సక్రమంగా అందడం లేదు. గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది నిర్వహిస్తున్న సర్వేలో ఈ విషయాలు తేటతెల్లమవుతున్నాయి. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ కుళాయి ఉందా..? నీరు వస్తుందా..? తదితర వివరాలతో చేపట్టిన సర్వే జిల్లాలో పూర్తయింది. మొత్తం 2,59,580 గృహాల్లో...