ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీరు

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో మిషన్ భగీరథ, మెడికల్ కళాశాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శాశ్వత ప్రాతిపదికన మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, కళాశాలకు అవసరమైన నీటి...