కొడిచెర్ల గ్రామాన్ని సందర్శించిన మిషన్ భగీరథ డీఈ
చర్యలకు బదులు రాజీలు అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం బతుకమ్మ, కోటగిరి : వాటర్ ట్యాంకులు తొలగించి ఇసుక ర్యాంపుకై తరలింపు అనే కథనానికి స్పందన లభించింది. కొడిచెర్ల గ్రామంలో మంచినీళ్ల ట్యాంకులను ఇసుక ర్యాంపు కోసం తరలించిన ఘటన పై అధికారులు స్పందించారు. మిషన్ భగీరథ డీఈ మున్ని నాయక్ శుక్రవారం గ్రామంలో పర్యటించి పరిస్థితి పై ఆరా తీశారు. ట్యాంకులను తొలగించిన వారి వివరాలు తెలుసుకొని స్థానిక ఎంపీడీవోతో కలిసి వారితో మాట్లాడారు. ట్యాంకులను తొలగించిన విషయాన్ని వారు ఒప్పుకొని...