Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 December 2024, 6:37 pm Posted by : ramakrishna

తల్లీకూతుళ్ల మిస్సింగ్.. కేసు నమోదు

కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి పట్టణంలోని భవాని రోడ్ లో నివాసముండే చాట్ల స్వరూప అనే మహిళ, ఆమె కూతురు మిస్సింగ్ అయినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. భవాని రోడ్ లో చాట్ల స్వరూప అనే మహిళకు ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి సంయుక్త అనే ఒక కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య గొడవ విషయంలో వేరువేరుగా ఉండటం వల్ల ఆమె కామారెడ్డిలో తల్లి దండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. ఈనెల4న ఉదయం నుంచి చాట్ల స్వరూప, ఆమె తన నాలుగు సంవత్సరాల కూతురుతో కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడో వెళ్లిపోయింది.  ఆమె ఆచూకీ గురించి చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా కూడా ఆమె దొరకలేదు. ఆమె తల్లి సిద్దవ్వ ఇచ్చిన దరఖాస్తు మేరకు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈమెకు కుడికాలు వంకరగా ఉంటుంది.  ఈమె ఆచూకీ తెలిసినవారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నందు తెలపాలని పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.