Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 May 2025, 8:24 pm Posted by : ramakrishna

చార్మినార్ వద్ద సందడి చేసిన ప్రపంచ సుందరి పోటీదారులు

హైదరాబాద్, బతుకమ్మ : హెరిటేజ్ వాక్ లో భాగంగా హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలోని చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ -2025 పోటీదారులు సందడి చేశారు. చార్మినార్ కు చేరుకున్నసుందరీమణులకు సంప్రదాయ అరబ్బీ మర్ఫా సంగీతంతో స్వాగతం పలికారు. చార్మినార్ అందాలు, చుట్టు పక్కల ప్రాంతాలను వారంతా సందర్శించారు. పాలబస్తీలోని చారిత్రక లాడ్ బజార్ లో ఎంపిక చేసిన పలు దుకాణాల్లో సుందరీమణులు గాజులు కొనుగోలు చేశారు.

Miss World contestants make a splash at Charminar