Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 May 2025, 3:26 pm Posted by : ramakrishna

పోచంపల్లికి ‘మిస్ వరల్డ్’ కాంపిటీటర్స్

హైదరాబాద్, బతుకమ్మ: నేత చీరలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండి అంతర్జాతీయ గుర్తింపు పొందిన పోచంపల్లిని మిస్ వరల్డ్ పోటీదారులు ఈనెల 15వ తేదీన సందర్శించనున్నారు. పోచంపల్లిని యునెస్కో ఇప్పటికే ప్రపంచంలో ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించిన విషయం తెలిసిందే.

మిస్ వరల్డ్ పోటీదారులు ఇక్కత్ సాంప్రదాయ టై – అండ్ – డై ప్రక్రియను పరిశీలించడంతోపాటు నేత కార్మికులతో సంభాషించనున్నారు. ఇప్పటికే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పై అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో పోటీదారులు పోచంపల్లిని సందర్శించనుండటంపై ఆసక్తి నెలకొంది.