కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి ఎన్. అభిలాష్ గౌడ్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్స్ పోటీలకు ఎంపికైనట్లు మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ నాగరాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.హన్మకొండ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్ (రెండవ స్థానం) సాధించినట్లు తెలిపారు.ఈనెల 16న పాండిచ్చేరిలో జరిగే 37వ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ష్-2026 కి ఎంపికయ్యాడని ఆ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో విద్యార్థి అభిలాష్ గౌడ్ ను ఘనంగా సన్మానించి ప్రొత్సహించినట్లు పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగారెడ్డి,భరత్,మనోజ్ కుమార్,నర్సాగౌడ్,ప్రేమ్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.