Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 August 2024, 2:28 pm Posted by : ramakrishna

జ్వరంతో మైనార్టి గురుకుల పాఠశాల విద్యార్ధిని మృతి

బతుకమ్మ, బాన్సువాడ

బాన్సువాడ మైనార్టీ పాఠశాలలో చదువుతున్న అంజలి( 12) బాలిక జ్వరం బారిన పడి మృతి చెందింది. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే చిన్నారులు ప్రాణాలు వదులుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పదంపల్లి గ్రామానికి చెందిన అంజలి బాన్సువాడలోని మైనార్టీ పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. శుక్రవారం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అంజలిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. వరుస ఘటనలు జరగడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మైనార్టీ వెల్పేర్ ఆఫీసర్ దయానంద్ లు పాఠశాలను సందర్శించారు.