Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 October 2024, 10:22 am Posted by : ramakrishna

   మైనర్ బాలిక అత్మహత్య

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని ఖిల్లారోడ్డు ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (15) అత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బాలికను వైద్యం కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి తీసుకురావడంతో వెలుగులోకి వచ్చింది. నగరంలోని రెండో టౌన్ పరిధిలో ప్రాంతానికి చెందిన బాలిక ఇంటిలోనే ఎలుకల మందు సేవించింది, గమనించిన కుటుంబ సభ్యులు జిజిహెచ్ కు తరలించగా అప్పటికే బాలిక చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. బాలిక అత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.